- ఓటు వేయకుండానే హెలికాప్టర్ ఎక్కిన జగన్..
- ఓటేస్తే అంతా సజావుగా ఉన్నట్లే..
- రీపోలింగ్ జరపాలంటూ ఎన్నికల అధికారిని కోరిన మాజీ సీఎం
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పులివెందుల హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రాజకీయంగా కాక రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హుటాహుటిన పులివెందులకు (YS Jagan Mohan Reddy) చేరుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఆయన ఓటు మాత్రం వేయకుండానే తిరుగు పయనమయ్యారు.
Read Also :
పులివెందులలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడ జరిగిన దారుణాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఓటు వేస్తే అంతా సజావుగా ఉన్నట్టే :
ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోకూడదని జగన్ నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఇప్పుడు ఓటు వేస్తే పులివెందులలో ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగానే జరిగిందనే అభిప్రాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు వేయడం లేదని స్పష్టం చేశారు.
రీపోలింగ్ జరపాలంటూ డిమాండ్ :
అంతేకాదు, పులివెందులలో జరిగిన పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ రీపోలింగ్ నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు. ఒకవేళ అధికారులు రీపోలింగ్‌కు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పులివెందులకు వచ్చి ఓటు వేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఓటు వేయకుండానే తన సొంత హెలికాప్టర్ వద్దకు చేరుకున్న జగన్, అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.



