ఫ్యామిలీ కస్టమర్లకు పండగే.. కొత్త క్లాసిక్ అవతార్‌లో హీరో డెస్ట్నీ 110 స్కూటర్.. ధర జస్ట్ ఎంతంటే?

Must read

  • హీరో డెస్ట్నీ 110లో కొత్త క్లాసిక్ లుక్..
  • రూ.76,400కే స్పెషల్ ఎడిషన్ లాంచ్
  • పండుగ సీజన్‌కు ముందే హీరో కొత్త స్కూటర్

Hero Destini 110 Classique Edition Launch : పండుగ సీజన్‌కు ముందే ప్రముఖ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) స్కూటర్ ప్రియులకు కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చింది. డెస్ట్నీ 110 స్కూటర్‌లో కొత్త క్లాసిక్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,400గా నిర్ణయించింది. ముఖ్యంగా రెట్రో స్టైల్ లుక్ కోరుకునే కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ కొత్త ఎడిషన్‌ను రూపొందించింది. అయితే, ఇందులో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

రెండు కొత్త కలర్ ఆప్షన్లు :
కొత్త హీరో డెస్ట్నీ 110 క్లాసిక్ ఎడిషన్ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మ్యాట్ గోల్డ్ ఫిష్ సిల్వర్ లైట్ ఇండస్ట్రీయల్ గ్రే కలర్‌తో బ్రౌన్ ఇన్నర్ ప్యానెల్స్, మ్యాట్ ఏరీస్ బ్రౌన్ కలర్‌తో బ్లాక్ ఇన్నర్ ప్యానెల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫ్రంట్ హ్యాండిల్ కవర్, సైడ్ ప్యానెల్స్‌పై కొత్త స్ట్రైప్ గ్రాఫిక్స్ ఇచ్చారు. కలర్ మిర్రర్లు, మ్యాచింగ్ సీట్, బ్రాండెడ్ రిమ్ టేప్, 3డీ క్లాసిక్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా ఈ స్కూటర్‌కు కొత్త లుక్‌ను అందిస్తున్నాయి..

Read Also : 

ఫీచర్లు, హార్డ్‌వేర్ ఇవే :
ఈ స్కూటర్‌లో 785మి.మీ పొడవైన సీట్ ఉంది. తమ సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన సీట్.. విశాలమైన ఫుట్‌బోర్డ్, ఫ్రంట్, బ్యాక్ 12 ఇంచుల వీల్స్, బ్యాక్ 100/80-12 వెడల్పాటి టైర్ అందించారు. సీటు కింద 19 లీటర్ల స్టోరేజ్ స్పేస్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయంతో ఫ్రంట్ కంపార్ట్‌మెంట్, బూట్ ల్యాంప్ ఉన్నాయి..

ఇంజిన్‌లో మార్పుల్లేవ్ :
ఇందులో పాత 110.9సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించారు. 7,250rpm వద్ద 8bhp పవర్, 5,750rpm వద్ద 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు i3S (Idle Stop-Start System) టెక్నాలజీ కూడా ఉంది. మొత్తానికి కొత్త కలర్స్, క్లాసిక్ డిజైన్‌తో డెస్ట్నీ 110 లైనప్‌లో ఈ ఎడిషన్ మరో ఆప్షన్‌గా చేరింది. ఫ్యామిలీ కమ్యూటర్లను లక్ష్యంగా చేసుకుని హీరో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!