Ah Movie : రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘అ’ (AH). అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, బ్లడీ హంగర్ అంటూ రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లింప్స్ తో ఇప్పటికే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. అయితే ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు, ప్రమోషన్స్ చేసారు.
తాజాగా అ సినిమాని వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అ సినిమా నవంబరు 12న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. విడుదల తేది అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also See :
స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ BH నిర్మాణంలో సాయి బాలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అ సినిమా మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ గా ఉండబోతుంది.
కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చానని నమ్ముతున్నాను. టైటిల్ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం… అమానుషం ఈ పదాల మధ్యే కథ మొత్తం ఉంది. రాహుల్ విజయ్ ఓ సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. నవంబరు 12న ఈ సినిమా రిలీజ్ కానుంది అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. భిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. రాహుల్ విజయ్ కెరీర్లో ఈ సినిమా మైల్ స్టోన్‌గా నిలుస్తుంది అని తెలిపారు.



