తండ్రి కష్టాలను గుర్తుచేసిన పిల్లలు.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ! అసలేం జరిగిందంటే?

Must read

  • ముకేశ్ అంబానీ కన్నీళ్లు.. పిల్లల మాటలకు భావోద్వేగం
  • తండ్రి కష్టాలను గుర్తుచేసిన ఇషా.. భావోద్వేగానికి గురైన అంబానీ
  • జియో వేదికపై అరుదైన దృశ్యం.. పిల్లల ప్రసంగంతో ఎమోషనల్

Mukesh Ambani Emotional : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. వ్యాపార ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్నో విజయాలు చూసిన ఆయన.. తాజాగా ఓ కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ముగ్గురు పిల్లలు వేదికపై మాట్లాడుతుండగా కళ్లలో నీళ్లు తిరిగాయి. జియో ప్రస్థానం, కుటుంబ వారసత్వానికి సంబంధించి వారు చెప్పిన మాటలు ముకేశ్ అంబానీని కదిలించాయి.

రిలయన్స్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు అక్టోబర్ 28న స్టాక్ ఎక్స్చేంజీల్లో ఎంట్రీ ఇచ్చింది. నేరుగా 21 శాతం ప్రీమియంతో రూ. 1358 వద్ద స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయింది. తద్వారా ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ గెయిన్స్ అందించింది. జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్‌కు ముందు ముంబైలో నిర్వహించిన కార్యక్రమం అంబానీ కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

ఈ వేడుకలో ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ అద్భుతంగా ప్రసంగించారు. తమ సంస్థ ప్రయాణం, జియో సాధించిన విజయాలు, కుటుంబ పెద్దల ఆశయాలపై వారు మాట్లాడారు. పిల్లలు మాట్లాడుతున్నంతసేపు ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. పలుమార్లు కళ్ల నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు..

Read Also : 

తండ్రి కష్టాలను గుర్తుచేసిన ఇషా :
ఇషా అంబానీ ప్రసంగిస్తూ.. తండ్రి ముకేశ్ అంబానీ గత ప్రయాణాన్ని గుర్తుచేశారు. 1977లో రిలయన్స్ ఐపీఓ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. చిన్న వయసు నుంచే సంస్థ ఎదుగుదల కోసం ఆయన పడిన కష్టాలను వివరించారు. అంతేకాదు, తన సోదరుడు ఆకాశ్ అంబానీ జియో కోసం గత 13 ఏళ్లుగా చేస్తున్న కృషిని సైతం ప్రశంసించారు.

జియో వ్యాపారం కాదు.. అనంత్ అంబానీ :
ఇక అనంత్ అంబానీ ప్రసంగిస్తూ.. జియో సంస్థకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జియో తమకు కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, దేశంలోని ప్రతి ఒక్కరినీ డిజిటల్ ప్రపంచంతో అనుసంధానించే ఒక పవిత్రమైన బాధ్యతగా పేర్కొన్నారు.

తాత ధీరూభాయ్ అంబానీ కలలు, ఆశయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. స్టాక్ ఎక్స్చేంజీలో మోగే గంట తనకు ఆలయ గంటలా అనిపిస్తుందని చెప్పడంతో కార్యక్రమంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

పిల్లలు తమ ముందే ఇంత ఎదిగి, కంపెనీ బాధ్యతలను తమ భుజాన వేసుకుని మాట్లాడుతుండటం ముకేశ్ అంబానీకి గర్వకారణంగా నిలిచింది. గతంలోనూ అనంత్ తన చిన్ననాటి ఆరోగ్య సమస్యలు, తల్లిదండ్రుల మద్దతు గురించి మాట్లాడినప్పుడు ముకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు జియో లిస్టింగ్ సమయంలో మరోసారి ఆయన కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!