Virosh : ఇటీవల విజయ్ రష్మిక కలిసి బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షోకి హాజరయ్యారు. ఈ షోలో వీరు మాట్లాడిన పలు మాటలను పలువురు సూడో ఫెమినిస్టులు వక్రీకరించి రష్మికని విజయ్ తో విడిపొమ్మని సలహాలు ఇస్తున్నారు. రష్మిక పెళ్లి చేసుకుందామని అడిగినా విజయ్ సంవత్సరం పాటు తిప్పించుకున్నాడని అని చెప్పిన మాటలు, విజయ్ షోలో రష్మికకు కాఫీ అందివ్వలేదని, ఓ ఈవెంట్ లో రష్మిక వాటర్ అడిగితే కనీసం బాటిల్ క్యాప్ కూడా తీసి ఇవ్వలేదని.. ఇలా పలు కామెంట్స్ ని తప్పుగా అర్ధం చేసుకొని విజయ్ పై విమర్శలు చేస్తున్నారు.
ఆల్రెడీ అలా కామెంట్స్ చేసే వాళ్లకు.. అది ఫెమినిజం కాదు. నాకు తను తోడున్నాడు. మీరెవ్వరూ లేరు అంటూ గట్టి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విజయ్ కూడా మీరేమన్నా అనుకోండి అంటూ ఓ పోస్ట్ చేసారు. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విజయ్ – రష్మిక (విరోష్) టీమ్.
Also See : Srinidhi Shetty : సొంతూళ్లో శ్రీనిధి శెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
తమ ఫిర్యాదులో.. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన పలు మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను మేము గౌరవిస్తాము. కానీ ఇలా కావాలని చేసే, తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోము అంటూ విరోష్ టీమ్ ప్రతినిధి సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు.
ఆ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డి.సి.పి.కి అందజేశారు. విరోష్ గౌరవాన్ని కాపాడేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని టీమ్ తెలియజేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


