Cyclone Arnab Threat : అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Must read

  • ఏపీ తీరానికి తుఫాను ముప్పు.. రంగంలోకి 21 సహాయక బృందాలు
  • గంటకు 140 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం
  • ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వ ముందస్తు చర్యలు
  • ఏపీకి తుఫాను ముప్పుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Cyclone Arnab Threat : ఏపీ తీరానికి తుఫాను ముప్పు పొంచి ఉంది.. అర్నబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది. తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనాల నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాణనష్టం జరగకుండా పనిచేయాలి : 
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆయన సూచించారు.

Read Also : AP Cyclone Alert : తుఫాను ముప్పు వేళ అప్రమత్తతే రక్షణ.. ఏపీ ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి!

పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని తెలిపారు.

రంగంలోకి 21 సహాయక బృందాలు : 
సహాయక చర్యలను వేగంగా చేపట్టేందుకు 10 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రెడీగా ఉంచారు. అధికారుల అంచనా ప్రకారం.. ఈ నెల 26వ తేదీ ఉదయానికి అర్నబ్ తుఫానుగా మారనుంది. అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా 27వ తేదీన అతి తీవ్ర తుఫానుగా బలపడే ఛాన్స్ కనిపిస్తోంది.

ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు 930 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. కోనసీమ, యానాం, కాకినాడ తీర ప్రాంతాల్లోనూ తుఫాను తీరం దాటే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

27 నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత :
తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో గాలి వేగం 140 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఏపీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!