Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ మూడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..

Must read

Telangana Rain Alert : తెలంగాణలో ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సాగు, తాగునీటితో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 29వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Also Read : HMWSSB: హైదరాబాద్‌లో నీటి వృథాపై కఠిన చర్యలు.. జలమండలి ఎండీ సంచలన నిర్ణయం.. రూ.5 వేల జరిమానా!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈనెల 28 నాటికి తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళ, బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 27 నుంచి 29వ తేదీ వరకు చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎల్ నినో వార్తల నేపధ్యంలో ఇప్పుడే వేసవికాలంను తలపించేలా ఎండల తీవ్రత ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయని తెలిపారు.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు, స్థానిక అధికారుల సూచనలు పాటిస్తూ ఉండాలని తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!