ATM Charges: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ షాక్.. ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపు.. అక్టోబర్ 1 నుంచే కొత్త రూల్స్

Must read

ATM Charges: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ శాలరీ అకౌంట్ ఖాతాదారులకు కోలుకోలేని షాకిచ్చింది. యూపీఐ డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరిగినప్పటికీ, ఇప్పటికీ అత్యవసర నగదు కోసం ఏటీఎంలపై ఆధారపడే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఏటీఎంల నిర్వహణ వ్యయం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో, ఎస్బీఐ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లభించే నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించింది. గతంలో శాలరీ ఖాతాదారులకు ఉచితంగా లభించిన 10 ఉచిత లావాదేవీలను అక్టోబర్ 1వ తేదీ నుంచి కేవలం 5 లావాదేవీలకు కుదించింది.

Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ.. కీలక అంశాలపై చర్చ!

అదనపు ఉపసంహరణలకు భారీ బాదుడు.. ఒక విత్‌డ్రాకు ₹27.14 దాకా ఛార్జీ:

నెలవారీ పరిమితి దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో(ATM Charges) నిర్వహించే ప్రతీ అదనపు నగదు విత్‌డ్రాపై రూ. 23 తో పాటు జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఒక్కో అదనపు విత్‌డ్రాకు ఖాతాదారులు మొత్తం రూ. 27.14 చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నెలకు ఐదు అదనపు లావాదేవీలు చేస్తే ఏకంగా రూ. 135.70 వరకు ఛార్జీల రూపంలో కోత పడుతుంది. ఈ ఉచిత పరిమితిలో కేవలం నగదు ఉపసంహరణలు మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలు కూడా కలిపి ఉంటాయని ఎస్బీఐ స్పష్టం చేసింది.

ఎస్బీఐ ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు యథాతథం.. సేవింగ్స్ ఖాతాదారులకు సేఫ్:

ఈ కొత్త నిబంధనలు కేవలం ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మాత్రమే వర్తిస్తాయని, సొంత ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రం శాలరీ ఖాతాదారులకు నిబంధనల ప్రకారం ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే సాధారణ సేవింగ్స్ ఖాతాదారుల విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న పాత నిబంధనలే కొనసాగుతాయి. వేరే బ్యాంక్ ఏటీఎంలను తరచూ ఉపయోగించే శాలరీ ఖాతాదారులు ఈ నూతన ఛార్జీల పరిమితిని గమనించి, అనవసర పెనాల్టీలు పడకుండా జాగ్రత్త వహించాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!