Prabhas : ఫౌజీ, స్పిరిట్, కల్కి-2, సలార్ 2.. లాంటి భారీ ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో డార్లింగ్‌తో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి ఓ డిఫరెంట్ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నారనే టాక్ ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పటివరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి ప్రభాస్‌తో సినిమా చేస్తే సరికొత్త జానర్ లో తీస్తారా లేక కామెడీ సినిమానే తీస్తారా అనే చర్చ జరుగుతుంది.
ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంక్రాంతి వస్తున్నాం సినిమా రిలీజ్ టైమ్‌లోనే హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. మీరు గట్టిగా అనుకోండి అయిపోద్ది అంటూ డార్లింగ్ ఫ్యాన్స్‌కి హోప్స్ కలిగించారు. ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న కమిట్మెంట్స్ను బట్టి చూస్తే వీరిద్దరి కాంబో సెట్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చన్న టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం జనవరి 12న విడుదల సినిమా చేస్తున్న అనిల్ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read : Sai Praseedha : ప్రభాస్ పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ప్రభాస్ పెద్ద చెల్లి..
అటు డార్లింగ్ బిజీ.. ఇటు అనిల్ నెక్స్ట్ సినిమా ప్లానింగ్.. మరి వాళ్లిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు రాబోతుందో వేచి చూడాల్సిందే. అనిల్ రావిపూడితో సినిమా అంటే పక్కా హిట్ అని తెలిసిందే. అది ఏ హీరో అయినా ఎలాంటి కథ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పిస్తాడు అనిల్. పాన్ ఇండియా సినిమాలతో కామెడీకి కాస్త దూరం అయిన ప్రభాస్ అనిల్ రావిపూడితో నిజంగానే సినిమా చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.


