IND vs NZ 2nd ODI : వైభవ్ వచ్చేస్తున్నాడు.. కివీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు తుది జట్టులోకి..! బ్యాటింగ్ ఆర్డర్ ఇదే..

Must read

IND vs NZ 2nd ODI : భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. అక్కడ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ పూర్తయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. గెలుపు జోష్ ఉన్నలో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. రెండో టీ20 మ్యాచ్ లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఆడబోతున్నాడు. సూర్యవంశీ ఆడే అవకాశం ఉన్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. రెండో టీ20 మ్యాచ్ శనివారం క్రెస్ట్‌చర్చ్ వేదికగా జరగనుంది.

Also Read : England vs Sri Lanka ODI : ఇంగ్లాండ్‌కు భారీ షాకిచ్చిన శ్రీలంక.. వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఊదేశారు.!

సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. తొలి టీ20 మ్యాచ్‌లో ఆడిన ఇషాన్ కిషన్ గాయంతో బాధపడుతున్నాడు. గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తొలి టీ20లో తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించాం. ఆ తరువాత ఇషాన్ బ్యాటింగ్ కు వచ్చినప్పటికీ.. రెండో టీ20‌లో ఆడే పరిస్థితి లేదు. బీసీసీఐ వైద్య సిబ్బంది అతన్ని ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

వైభవ్ సూర్యవంశీ రెండో టీ20 మ్యాచ్ కు తుదిజట్టులో చేరితే ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. వైభవ్ దూకుడైన బ్యాటింగ్ చేసే ప్లేయర్ కావడంతో అతన్ని ఓపెనర్‌గానే పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా క్రీజులోకి వస్తున్నారు. ప్రస్తుతం వైభవ్ తుది జట్టులోకి ఎంట్రీ ఇస్తే.. వైభవ్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, సంజూ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. గతంలో సంజుకు వన్‌డౌన్ లో ఆడిన అనుభవం ఉంది. ఇషాన్ కిషన్ వన్ డౌన్ బ్యాటర్ కావడంతో.. అతని స్థానంలో వచ్చే వైభవ్ కూడా అదే స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!