iPhone Duo Sale : ఐఫోన్ డ్యూయో సేల్ స్టార్ట్.. ధర రూ. 4.5 లక్షలు, భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. కొనాలంటే ఇలా చేయండి!

Must read

  • ఐఫోన్ డ్యూయో కోసం భారీ డిమాండ్.. జనవరి వరకు వెయిటింగ్
  • ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
  • ప్రీ-ఆర్డర్లు మిస్ అయ్యారా? ఐఫోన్ డ్యూయో ఆఫర్ అదిరింది

iPhone Duo Sale : ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ డ్యూయో భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఆపిల్ ఫస్ట్ టైం దించిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 23, 2026 సేల్ మొదలైంది.

అయితే, ఈ ఐఫోన్‌ ధర ఎక్కువ అయినా భారీ డిమాండ్ ఉండటంతో వెంటనే చేతికి అందడం కష్టంగా మారింది. ఇప్పటికే డెలివరీ కోసం 2027 జనవరి మధ్య వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐఫోన్ డ్యూయో సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఐఫోన్ డ్యూయో ధర ఎంత? :
ఈ ఫోన్ 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 2,99,900గా ఉంది. 512GB మోడల్ రూ. 3,24,900కు, 1TB మోడల్ రూ. 3,74,900కు అందుబాటులో ఉన్నాయి. ఇక టాప్ మోడల్ 2TB స్టోరేజ్‌తో రూ. 4,49,900 ధరకు లభిస్తోంది. స్టార్ వైట్, నైట్ స్కై కలర్ ఆప్షన్లలో ఈ ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Read Also : ICICI Bank Charges 2026 : డిసెంబర్ 1 నుంచి ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు.. ఎవరి జేబుకు చిల్లు పడుతుందంటే?

రూ. 7వేల వరకు డిస్కౌంట్ :
ఐఫోన్ డ్యూయో కొనాలనుకునే వారికి ఆపిల్ కొన్ని ఆఫర్లు అందిస్తోంది. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 7వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్‌ను మార్చుకుంటే రూ. 81,500 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. అయితే అసలు బెనిఫిట్ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్, వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

స్టోర్లలో వెంటనే దొరుకుతుందా? :
దేశంలోని 6 అధికారిక ఆపిల్ స్టోర్లు అక్టోబర్ 23న ఉదయం 8 గంటలకు ఓపెన్ కానున్నాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణే నగరాల్లోని స్టోర్లలో కొనుగోలు వివరాలు తెలుసుకోవచ్చు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లేకుండా నేరుగా వెళ్లి ఐఫోన్ కొనుగోలు చేయడం కుదరకపోవచ్చు..

ప్రీ-ఆర్డర్లు మిస్ అయితే ఆపిల్ ఇండియా వెబ్‌సైట్, ఆపిల్ స్టోర్ యాప్ లేదా క్రోమా, విజయ్ సేల్స్ వంటి డీలర్ల వద్ద లేటెస్ట్ స్టాక్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. స్టాక్ పరిమితంగా ఉండటంతో కొనుగోలు చేసే ముందు లభ్యత, డెలివరీ డేట్ చెక్ చేసుకోవడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!