AP Weather : ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ..

Must read

AP Weather : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వచ్చే వారం రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలతోపాటు.. భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read : AP Municipal Elections 2026 : ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్.. నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. అలాగే తఫాన్ గా రూపాంతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలతోపాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నైతోపాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తిరుపతిలోనూ రెండు రోజులు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఏపీలో పిడుగులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వారం రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!