Vivo Y600 Launch : ఒక్క ఫోన్‌తో గిన్నిస్ రికార్డ్? 10,000mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

Must read

  • 10,000mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. అక్టోబర్ 30న లాంచ్
  • వివో Y600 వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో సందడి
  • ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే ఫోనా? వివో Y600 స్పెషాలిటీస్ ఇవే

Vivo Y600 Launch : కొత్త వివో ఫోన్ వచ్చేస్తోంది.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త ఫోన్‌తో సందడి చేసేందుకు వివో రెడీ అవుతోంది. భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో వివో Y600ను చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 30న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా 10,000mAh బ్యాటరీ ఇప్పుడు టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

10,000mAh బ్యాటరీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ :
వివో Y600లో కంపెనీ బ్లూ ఓషన్ బ్యాటరీ పేరుతో 10,000mAh భారీ బ్యాటరీని అందిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే లాంగ్ టైమ్ ఫోన్‌ వాడేవారికి ఈ బ్యాటరీ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, 32 గంటల 37 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్ ప్రొడక్టు పరీక్షకు సంబంధించిన లైవ్‌స్ట్రీమ్‌ను పూర్తి చేసినందుకు ఈ ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా నిలిచిందని కంపెనీ పేర్కొంది.

Read Also : Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. రూ.1.80 లక్షల ఫోన్‌పై అమెజాన్‌లో భారీ తగ్గింపు..

50MP కెమెరా.. రెండు కలర్ ఆప్షన్లు :
డిజైన్ విషయానికొస్తే.. వివో Y600 ఫ్లాట్ ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్స్, రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్‌తో రానుంది. ఇందులో 2 బ్యాక్ కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50MP సెన్సార్‌తో పాటు ఆస్ఫెరిక్ లెన్స్‌ అందిస్తుంది. ఈ ఫోన్ వైట్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.

డిస్‌ప్లే, ఛార్జింగ్ వివరాలివే :
భారత మార్కెట్లో వివో S2 ఎఫ్ఈ పేరుతో అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్ వేరియంట్‌లో 6.83 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అయితే, చైనీస్ వివో వై600లో ఇవే స్పెసిఫికేషన్లు ఉంటాయా అనేది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే? :
వివో Y600 గ్లోబల్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, అంతర్జాతీయ లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అక్టోబర్ 30న జరిగే చైనా లాంచ్‌లో మరిన్ని ఫీచర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!