Hyderabad Traffic Diversions: హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. నేటి నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో ప్రయాణిస్తే ఇబ్బందులే!

Must read

Hyderabad Traffic Diversions: నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్ పరిసర ప్రాంతాలలో అధికారులు ప్రత్యేకంగా బేబీ పాండ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ, విగ్రహాల ఊరేగింపు వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు అక్టోబర్ 21 నుంచి 24 వరకు నగరంలోని పలు కీలక రహదారుల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

Srikakulam Tragedy: ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.. ఊబిలో చిక్కుకుని నలుగురు మృతి.. శ్రీకాకుళం బీచ్‌లో ఘోర విషాదం

ప్రధాన జంక్షన్లలో మళ్లింపులు.. ఖైరతాబాద్, సెక్రటేరియట్ వైపు రూట్ల మార్పు:

పంజాగుట్ట, రాజభవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు (Hyderabad Traffic Diversions)మళ్లిస్తున్నారు. అలాగే నిరంకారి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్ వైపు పంపుతున్నారు. ఇక్బాల్ మినార్ నుంచి సెక్రటేరియట్ వైపు వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించనున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్, లిబర్టీ పరిసరాల నుంచి సెక్రటేరియట్ వైపు సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని, పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

పీవీఎన్‌ఆర్ మార్గంలో ఆంక్షలు.. వాహనదారులకు ప్రత్యామ్నాయ సూచనలు:

అప్పర్ ట్యాంక్ బండ్, నల్లగుట్ట బ్రిడ్జి నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్డు) వైపు వెళ్లే వాహనాలను సోనాబీ అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు. అదేవిధంగా రాణిగంజ్, మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద డైవర్ట్ చేయనున్నారు. ఇక్బాల్ మినార్ రూట్‌లో కేవలం అమ్మవారి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. కావున నిమజ్జన సమయాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు ముందస్తుగా ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!