Supreme Court : ఏపీలో ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచండి..

Must read

AP Local Body Elections 2026 : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే, తాజాగా.. సుప్రీంకోర్టు ఏపీ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఆదేశించింది. అంతేకాక.. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఈరోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈనెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!