Ranabaali : ‘రణబాలి’పై నాగ్ అశ్విన్ రివ్యూ.. విజయ్ కెరీర్‌లోనే బెస్ట్, రష్మిక పాత్రపై ఆసక్తికర కామెంట్స్!

Must read

Ranabaali : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన చిత్రం ర‌ణ‌బాలి. రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆర్నాల్డ్ ఓస్లూ, ఈశ్వీరీరావు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా అజ‌య్ అతుల్ సంగీతాన్ని అందించారు. ద‌స‌రా కానుక‌గా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. ఇక ఈ చిత్రం పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చేరిపోయాడు.

ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. చరిత్రలో మరుగునపడిన కథలను, ప్రజల ఆవేదనను వెండితెరపైకి తీసుకురావడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. విజయ్ దేవరకొండ నటన, జయమ్మ పాత్రలో రష్మిక మందన్న అభినయం తనను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌న్నారు.

Saanve Megghana : మీకు బొట్టు అంటే ఇష్ట‌మా? తెలుగు అమ్మాయి శాన్వి మేఘ‌న ఫోటోలు వైర‌ల్‌..

ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంచుకున్న పాత్ర స‌వాళ్ల‌తో కూడుకున్న‌దని చెప్పుకొచ్చారు. ఆ పాత్ర‌కు విజ‌య్ ప్రాణం పోశార‌న్నారు. ఆ పాత్ర కోసం త‌న‌ను తాను మ‌లుచుకున్న తీరు, సూప‌ర్ హీరోలా తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకుంద‌ని ప్ర‌శంసించారు. విజ‌య్ కెరీర్‌లోనే ఇది ఓ అత్య‌త్తుమ చిత్రంగా నిలుస్తున్నారు.

రష్మిక పోషించిన జయమ్మ పాత్ర కూడా త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌న్నారు. ఆమె నటన చూసిన తర్వాత జయమ్మ పాత్రనే ప్రధానంగా తీసుకుని ఒక పూర్తి సినిమా చూడాలనిపించిందని పేర్కొన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ‘రణబాలి’ చారిత్రక నేపథ్యం, ఆకట్టుకునే విజువల్స్, భావోద్వేగాలతో కూడిన కథనంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోందన్నారు.

ఇక ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లోనే చూడాలని కోరారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!