Bigg Boss Weekend Episode : నేడు శనివారం వీకెండ్ ఎపిసోడ్. నాగార్జున డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఆడియన్స్ తో మాట్లాడారు. అనంతరం శుక్రవారం హౌస్ లో జరిగింది కొంత చూపించారు. ముకేశ్ తనని పట్టించుకోనందుకు ఝాన్సీ ఏడ్చింది. దీనిపై ముకేశ్ – వర్షిణి మాట్లాడుకున్నారు. వంశీ – త్రిగున్ మాట్లాడుకున్నారు. ముకేశ్ ఝాన్సీ దగ్గరకు వచ్చి ఓదార్చాడు. వాష్ రూమ్ దగ్గర బట్టల గురించి త్రిగున్ – రోహిత్ మధ్య గొడవ అయింది. రోహిత్ తన బట్టలు మడతపెట్టకుండా అక్కడే ఉంచేస్తే రోహిత్ తీసి కింద పెట్టాడని రోహిత్ ఇష్టమొచ్చినట్టు త్రిగున్ ని తిట్టాడు. కొడతాను అని కూడా అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. కెప్టెన్ కి ఇచ్చే గోల్డ్ కాయిన్స్ కొత్త కెప్టెన్ రామ్ ప్రసాద్ కి ఇచ్చారు. తన కాయిన్స్ ని నరేష్, దేబ్జానీ కి ఇచ్చాడు రామ్ ప్రసాద్. షాలిని – రోహిత్ మళ్ళీ కాసేపు లవ్ ట్రాక్ నడిపించారు. రాత్రి పూట కూడా షాలిని – రోహిత్ గుసగుసలు ఆడటంతో బిగ్ బాస్ తిట్టాడు. బిగ్ బాస్ మూడు సార్లు చెప్పినా రోహిత్ – షాలిని సీక్రెట్ గా మాట్లాడుకుంటూనే ఉన్నారు.
అనంతరం నాగార్జున కంటెస్టెంట్స్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట రామ్ ప్రసాద్ కెప్టెన్ అయినందుకు అభినందించాడు. బట్టల గొడవ గురించి రామ్ ప్రసాద్ ని అడిగారు నాగార్జున. బట్టలు అలా వదిలేస్తున్నందుకు అందర్నీ తిట్టారు నాగ్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుండటంతో కెప్టెన్ సుధీర్ ని కూడా ప్రశ్నించారు. ఇలాంటివన్నీ చూసుకొని హౌస్ ని ఆర్డర్ లో పెట్టాలి వచ్చే వరం లోపు అని నాగార్జున రామ్ ప్రసాద్ కి చెప్పారు.
Also See : Garividi Lakshmi : రియల్ ‘గరివిడి లక్ష్మి’ని చూశారా..? గరివిడి లక్ష్మి సక్సెస్ మీట్లో సందడి..
నీతూ నటరాజ్ ని కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్నారు. ఆట ఆడటానికి వచ్చావా? హౌస్ లో వాళ్ళను కోచ్ చేయడానికి వచ్చావా అని తిట్టి రోహిత్ తో మాట్లాడిన వీడియో చూపించారు. రోహిత్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చే ముందు నీతూతో మాట్లాడిన మాటలు రోహిత్ కి చెప్పింది. దీంతో బయటి విషయాలు ఎవరికీ చెప్పకూడదు అనే పెద్ద రూల్ బ్రేక్ చేసినందుకు నాగార్జున తిట్టారు. దీంతో నీతూ ఏడ్చింది. ఇంకోసారి రిపీట్ చేస్తే బయటకు డైరెక్ట్ పంపించేస్తాను అన్నారు. కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడింది ఎవరికీ చెప్పొద్దన్నారు.
షాలిని ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. రోహిత్ తో నీతూ మాట్లాడిన వీడియో షాలినికి చూపించారు. అనంతరం షాలిని బయటకు వచ్చాక అమన్ నామినేషన్స్ గురించి మాట్లాడిన వీడియో చూపించాడు. అమన్, షాలిని, రోహిత్ ఎవరెవర్ని నామినేట్ చేయాలి అని గ్రూప్ గా మాట్లాడుకున్న వీడియోని హౌస్ అందరికి చూపించాడు నాగ్. దీంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. లాస్ట్ వీక్ ఇదే పాయింట్ పై నాగార్జున తిట్టాడు షాలిని ని. అయినా మళ్ళీ చేసింనందుకు తిట్టాడు. షాలిని కవర్ చేయడానికి చూడటంతో మళ్ళీ తిట్టాడు. దీంతో అమన్, షాలిని, రోహిత్ లు నామినేషన్స్ గురించి మాట్లాడినందుకు వచ్చే వారం కెప్టెన్ అవ్వడానికి, పోటీ చేయడానికి అర్హత లేదు అనే పనిష్మెంట్ ఇచ్చారు నాగార్జున.
అలాగే షాలిని.. త్రిగున్ ని బూతులు తిట్టిన వీడియో చూపించాడు నాగార్జున. దీంతో షాలిని ఏడుస్తూ మాట్లాడింది. త్రిగున్ గేమ్ లో మోసం చేసిన దాని గురించి చెప్పింది. రోహిత్ మాట్లాడటానికి మధ్యలో ట్రై చేయడంతో రోహిత్ ని తిట్టాడు. ఇది నామినేషన్స్ కాదు షాలిని సపోర్ట్ గా మాట్లాడటానికి అని తిట్టాడు నాగ్. షాలినితో త్రిగున్ కి సారీ చెప్పించాడు నాగ్. షాలిని కి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో రోహిత్ ని అడిగాడు. డబల్ డ్యూటీ ఇమ్మన్నాడు. ఏ డ్యూటీ చేయాలో రామ్ ప్రసాద్ చెప్తా అన్నాడు. అనంతరం నామినేషన్స్ లో షాలిని అనవసరంగా నీతూతో గొడవ పెట్టుకున్న వీడియో చూపించాడు. నీతూ కొట్టకపోయినా కొట్టింది అని చెప్పి ఆమెని మెంటల్ అని షాలిని గొడవ పెట్టుకున్న వీడియో చూపించాడు. దీంతో మరోసారి షాలినిని తిట్టాడు నాగార్జున. నీతూ వల్ల రోహిత్ మారిపోయాడు అందుకే ఎఫెక్ట్ అయ్యాను అని చెప్పింది షాలిని. రోహిత్ కాళ్ళు షాలిని ఓ ఎపిసోడ్ లో మొక్కడంతో నీతూ కాళ్ళని మొక్కమన్నాడు కానీ నీతూనే వద్దు అంది. ఇప్పుడు కూడా మారకపోతే నిన్ను ఎవరు కాపాడలేరు అని అందరూ అనుకునేదే చెప్పాడు నాగ్.
Also See : Pavani Karanam : ‘పుష్ప’ ఫేమ్ పావని కరణం.. షార్ట్ స్కర్ట్ లో బోల్డ్ పోజులు..
అమన్ నామినేషన్స్ లో ముకేశ్ ని తిట్టిన వీడియో చూపించాడు. దాంతో అమన్ ని తిట్టాడు. అలాగే గేమ్ లో అమన్ – షాలిని మధ్య డిస్కషన్ జరిగిన గురించి మాట్లాడారు. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అందరూ మాట్లాడారు. షాలిని చేసింది కరెక్ట్ అయితే త్రిగున్ చేసింది కరెక్ట్ అని చెప్పినా వినలేదు షాలిని. నాగార్జున బ్రేక్ అని కాసేపు పక్కకు వెళ్లడంతో అమన్ తో షాలిని గొడవ పెట్టుకుంది. ఇంత జరిగినా నాగార్జున తిట్టినా షాలిని ఏమి మారకుండా అమన్ మీద అరిచింది. రోహిత్ రామ్ ప్రసాద్ దగ్గరకు వచ్చి త్రిగున్ మాట్లాడిన వీడియోలు బయట పెట్టారా అని అరిచాడు.
అనంతరం నాగార్జున రోహిత్ ని మాట్లాడిస్తే త్రిగున్ గురించి మాట్లాడటంతో అతని గురించి ఎందుకు నీ గురించి చెప్పు అన్నాడు. తన గురించి ఎవరూ తప్పుగా నౌకోకూడదు అన్నాడు రోహిత్. దీంతో ఆటను చేసే తప్పులని గుర్తుచేసి తప్పులు చేసినా తప్పుగా అనుకోకూడదు అని కౌంటర్ ఇచ్చాడు నాగ్. రోహిత్ అమన్ ని దొబ్బి తినడానికి వస్తున్నారు అని అన్న మాటలపై డిస్కషన్ జరిగింది. అందరూ రోహిత్ దే తప్పు అన్నారు.
ఇక త్రిగున్ ఆలోచన ధోరణి ని మార్చుకోమన్నారు. రోహిత్ వాళ్ళని రొట్ట గ్యాంగ్ అన్నందుకు తిట్టారు. ఫుడ్ విషయంలో త్రిగున్ – రోహిత్ మధ్య గొడవ గురించి మాట్లాడారు. సుధీర్, వర్షిణి దీని గురించి మాట్లాడారు. రోహిత్ సరిగ్గా ఆడట్లేదు అని నాగార్జున తిట్టారు. చివరగా వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ ని లేపి వీళ్ళలో అసలు ఫైర్ లేదు అని చెప్పి వీళ్ళ గురించి రేపు మాట్లాడదాం అన్నారు నాగ్. మొత్తానికి ఇన్ని రోజుల నుంచి షాలిని చేసే హడావిడికి, అరుపులకు ఇవాళ నాగార్జున వరుసగా ఆమె పాయింట్స్ చూపించి ఆమె దుమ్ము దులిపేసారు. ఆల్రెడీ గత వారం వార్నింగ్ లు ఇచ్చినా మారని షాలిని ఇప్పటికైనా మారుతుందా చూడాలి. రేపు ఎలిమినేషన్ ఉండబోతుంది.
Also Read : Anirudh : ఓ పక్క త్వరలో పెళ్లి.. మరో పక్క పాన్ ఇండియా బిజీ..


