భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం.. వేడుకల్లో పాల్గొన్న క్యానం రాజ్యలక్ష్మి

Must read

వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జనోత్సవాల్లో భాగంగా సాయినాథపురం ప్రాంతంలో టీవీ9 బాలాజీ, రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సాయినాథపురం ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏడాది స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు సూచించారు.అనంతరం క్యానం రాజ్యలక్ష్మి డాక్టర్ ఏఎస్ రావు నగర్, కాప్రా ప్రాంతంలో రోహిన్, శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహాన్ని సందర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.డీఆర్ ఏఎస్ రావు నగర్, కాప్రా ప్రాంతంలో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు ఉత్సాహంగా పాల్గొంటూ గణేష్ నామస్మరణతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్.కే. శ్రీనివాస్, జగదీశ్ చారి, ఓం ప్రకాష్, గౌలికర్ మిట్టు, దుర్గ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!