ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డుల గ్రహీత డా. గజల్ శ్రీనివాస్‌కు మారిషస్‌లో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ శాంతి, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాల ప్రచారానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారాన్ని అందజేశారు.మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లోని 108 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కలిగిన హరి హర దేవస్థానం ప్రాంగణంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మారిషస్ దేశాధ్యక్షులు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ చేతుల మీదుగా డా. గజల్ శ్రీనివాస్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు.
వివిధ ప్రపంచ భాషల్లో గానం చేస్తూ సంగీతం ద్వారా శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో డా. గజల్ శ్రీనివాస్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మారిషస్ దేశాధ్యక్షులు ప్రశంసించారు. సనాతన ధర్మం, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను సంగీతం ద్వారా ప్రచారం చేయడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.హరి హర దేవస్థానం ప్రాంగణంలో అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి డా. గజల్ శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమని శ్రీ ధరమ్ బీర్ గోకుల్ కొనియాడారు. సంగీతాన్ని కేవలం వినోదానికి పరిమితం చేయకుండా ప్రపంచ శాంతి, మానవతా విలువలు, భారతీయ సంస్కృతి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
మారిషస్‌లో డా. గజల్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి, భారతీయ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని దేశాధ్యక్షులు పేర్కొన్నారు. సంగీతం భాషలు, ప్రాంతాలు, దేశాల సరిహద్దులను దాటి ప్రజలను ఒకతాటిపైకి తీసుకురాగల శక్తివంతమైన మాధ్యమమని, ఆ దిశగా డా. గజల్ శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, శాంతి, అహింసా సందేశాలను సంగీతం ద్వారా విస్తరించేందుకు డా. గజల్ శ్రీనివాస్ చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది. మారిషస్‌లో జరిగిన ఈ సత్కారం తెలుగు కళా, సంగీత రంగాలకు కూడా గర్వకారణంగా పలువురు అభిప్రాయపడ్డారు.ట్రిపుల్ గిన్నీస్ ప్రపంచ రికార్డుల గ్రహీతగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం లభించడం ఆయన సంగీత ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.


