స్మార్ట్‌ఫోన్ కొనేవాళ్లకు పండగే.. 2027లో ఫోన్ ధరలు తగ్గే ఛాన్స్!

Must read

  • ర్యామ్ ధరలపై కీలక అప్‌డేట్
  • ఫోన్ ధరల మంటకు బ్రేక్ పడనుందా?
  • 2027లో భారీ ఊరట వచ్చే ఛాన్స్

Smartphone Prices : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకు ఓ గుడ్ న్యూస్.. గత కొంతకాలంగా మొబైల్ ధరలు పెరుగుతుండగా కొత్త ఫోన్ కొనాలంటేనే చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ర్యామ్, స్టోరేజ్ వంటి మెమరీ భాగాల ధరలు పెరగడం ఫోన్ తయారీ ఖర్చులపై ప్రభావం చూపిస్తోంది. అయితే, 2027లో ఈ పరిస్థితి కొంత మారే అవకాశం కనిపిస్తోంది. ర్యామ్ ధరల పెరుగుదల గతంలో అంచనా వేసినంత వేగంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి..

2027లో మొబైల్ ధరలకు బ్రేక్ పడుతుందా? :
మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ అంచనాల ప్రకారం.. 2027లో DRAM కాంట్రాక్ట్ ధరల పెరుగుదల వేగం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే.. ర్యామ్ ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోతాయని కాదు. కానీ, ఇప్పటివరకు ఉన్నట్టుగా ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉండకపోవచ్చు..

దీనికి ప్రధాన కారణం.. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడమే.. ర్యామ్ ధరలు ఎక్కువగా ఉండటంతో కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అటు రిటైలర్లు కూడా కొత్త స్టాక్‌ను ఎక్కువగా తెప్పించుకోవడం లేదు. ఇప్పటికే ఉన్న పాత స్టాక్‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో మెమరీ చిప్స్‌కు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి..

DDR4 ధరలు తగ్గుతున్నా.. DDR5 సంగతేంటి? :
ప్రస్తుతం DDR4, DDR3 మెమరీ ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే, DDR5 విషయంలో మాత్రం ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. గతంలో ఊహించినంత వేగంగా పెరుగుదల ఉండకపోవచ్చని అంచనా..

మరోవైపు.. శాంసంగ్, SK హైనిక్స్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు తమ మెమరీ ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఏఐ అవసరాల వైపు మళ్లిస్తున్నాయి. విన్‌బాండ్, నాన్యా వంటి సంస్థలు మాత్రం మార్కెట్‌లో సరఫరా అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2027లో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గుతాయని ఇప్పుడే చెప్పలేం.. కానీ, ధరల పెరుగుదల వేగం తగ్గితే కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి కచ్చితంగా కొంత ఊరట లభించవచ్చు..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article