PM Modi Tirupati Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ ఖరారైంది. తిరుపతి జిల్లాలో మూడు రోజులు మోదీ పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఏర్పేడులోని ఐసర్లో జరగనున్న 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులలో దేశవ్యాప్తంగా సుమారు 200 మంది ఐపీఎస్ అధికారులు పాల్గోనున్నారు.
ఈ సదస్సులో దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ సవాళ్లపై సదస్సులో కీలక చర్చలు ఉండనున్నాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్, అక్రమ రవాణాపై ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. ఉగ్రవాద ముప్పు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణపై సమీక్షించనున్నారు. పోలీసు వ్యవస్థలో ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించనున్నారు.
మోదీ టూర్ ఇలా..
డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.
మోదీకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఐసర్ కేంద్రానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
డిసెంబర్ 5న ఉదయం 8.15గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పోలీసు సదస్సులో పాల్గొంటారు.
6వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడే జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
6వ తేదీ సాయంత్రం 5.30గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోను్ననారు. అనంతరం తిరిగిపయణమవుతారు.
డిసెంబర్ 5, 6 తేదీల్లో ఉదయం 6గంటలకు యోగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గోనున్నారు.
పటిష్ఠ భద్రత..
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. రవాణా, వసతి, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇదిలాఉంటే.. ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ ఢోబాల్ హాజురుకానున్నారు.




