అక్కడ.. ఇక్కడ.. ఎక్కడైనా లోకేశ్‌ మార్క్ దూకుడు.. పార్టీ క్యాడర్‌లో జోష్..

Must read

Nara Lokesh : మంగళగిరి ఎమ్మెల్యే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి. అక్కడి వరకే ఆగిపోవడం లేదు మినిస్టర్ నారా లోకేశ్. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో అన్నీ తానై నడిపిస్తున్నారట. అలా అని హడావుడి లేదు. హంగామా అసలే కనిపించట్లేదన్న చర్చ జరుగుతోంది. సమస్య ఏదైనా..ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా..ఆయన దృష్టికి వెళ్లిందంటే చాలు సాల్వ్‌ అయిపోవాల్సిందే అన్నట్లుగా ఫోకస్డ్‌గా పనిచేస్తున్నారనే టాక్ నడుస్తోంది. కష్టాల్లో టీడీపీ నేతలకు భరోసా, ఆత్మీయ పరామర్శ..క్యాడర్‌కు పెద్దన్నగా..ప్రజలు బాధల్లో ఉంటే వారిలో ఒకడిగా అంతటా లోకేశ్‌ పేరు మారుమోగడం తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపుతోందట.

నారా లోకేష్ పనితీరు..వ్యవహార శైలి..మాట్లాడుతున్న తీరు..విమర్శకులు, ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా..ఊహకందనంతగా తనను తాను లీడర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. 2019 నుంచి తన గ్రాఫ్‌ను డే బై డే పెంచుకుంటూ వస్తున్నారని చర్చించుకుంటున్నారు. అటు ఇంటర్నేషనల్ సమ్మిట్స్‌లో క్లాస్ టచ్‌తో అలరిస్తున్నారు. ఇటు పొలిటికల్ డయాస్‌ల మీద మాస్ టచ్‌తో మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీలో పెద్దన్నగా ఆయన క్యాడర్‌తో మమేకం అవుతున్న తీరు అయితే సమ్‌థింగ్‌ స్పెషల్‌గా..స్పెషల్ అట్రాక్షన్‌గా ఉందని అంటున్నారు.

మంచికి, చెడ్డకూ అందరికీ అండగా..నేనున్నానంటూ..నారా లోకేశ్‌ రియాక్ట్ అవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోందట. ఇటు ప్రభుత్వంలో మంత్రి, అటు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ..సేమ్‌టైమ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ..పార్టీ. ప్రభుత్వంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని టీడీపీలో తెగ హ్యాపీ అవుతున్నారట. పైగా కాన్‌క్లేవ్‌లు, సెమినార్‌లు, సదస్సులకు అటెండ్ అవుతూ..మీడియా ఇంటర్వూల్లో అదరగొడుతుండటంతో లోకేశ్‌ బాబులో ఎంత మార్పు అంటూ తెలుగు తమ్ముళ్లే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ క్యాడర్‌తో ఆయన మమేకం అవుతున్న తీరు కూడా శభాష్ అనిపించుకుంటోందట. తమ పార్టీ వారి ఇంట శుభకార్యమైనా..విషాదం జరిగినా..లోకేశ్‌ టీడీపీ లీడర్లకు పెద్దన్నగా అండగా నిలుస్తున్నారు. తాను ఉన్నానని భరోసా ఇస్తున్నారు. దాంతో ఆయన పార్టీ లీడర్లు, క్యాడర్‌కు మరింత దగ్గర అయిపోతున్నారని అంటున్నారు. ఇవాళ విశాఖలో ఉంటే..తెల్లారే విజయనగరంలో ల్యాండ్ అయిపోతున్నారు. పెళ్లి వేడుకల్లో అందరితో కలసి ఆనందంగా ముచ్చటిస్తూ..లీడర్లతో అటాచ్‌మెంట్‌ పెంచుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

రాజకీయ పార్టీల అగ్రనేతలు సాధారణంగా లీడర్లకు పెద్దగా అపాయింట్‌మెంట్లు ఇవ్వరనే అపవాదు ఉంటుంది. వైసీపీలో ఈ చర్చ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్యూచర్ లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవుతున్న లోకేశ్‌..సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇంట్రెస్టింగ్‌గా మారింది. పార్టీనే ఫ్యామిలీ అన్నట్లుగా ఇండికేషన్ ఇస్తున్నారు. లీడర్లు, క్యాడర్‌ను కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్‌ చేస్తూ..మాటల్లో కాదు ఆచరణలో చూపిస్తున్నారని టీడీపీలో చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబు క్యాడర్ కోసం ఒక అడుగు ముందుకొస్తే లోకేశ్‌ నాలుగు అడుగులు వేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇక నారా లోకేశ్ తీసుకొచ్చిన మైటీడీపీ యాప్ ద్వారా 10 లక్షల మంది కార్యకర్తలు ఒకే డిజిటల్ వేదికపైకి వచ్చారు. అధినేత సందేశాలు, పార్టీ సూచనలు క్షణాల్లో చేరడంతో పాటు, కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక సమస్యలు నేరుగా అధిష్ఠానానికి చేరుతున్నాయి. పార్టీ బలోపేతానికి ఈ యాప్ కీలకంగా మారుతుందని అంటున్నారు. కార్యకర్త నుంచి అధినేత వరకు మధ్యవర్తులు లేకుండా నేరుగా ఇంటరాక్ట్ అయ్యే డిజిటల్ వ్యవస్థగా మైటీడీపీ యాప్‌ను అభివృద్ధి చేసి లోకేశ్ తన మార్క్ చూపించారని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో రియల్ టైమ్ గవర్నెన్స్, పార్టీలోనూ క్విక్ రియాక్షన్‌ ఉండేలా లోకేశ్ మై టీడీపీ యాప్‌ను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. కార్యకర్త కష్టానికి గుర్తింపు, ప్రతిభకు ప్రోత్సాహం, అంకితభావానికి తగిన అవకాశాలు కల్పిస్తూ..లోకేశ్‌ అన్నీ తానై వ్యవహరిస్తుండటం మాత్రం పార్టీలో కొత్త జోష్ నింపుతుందని అంటున్నారు. ఫ్యూచర్‌లో ఇంకా లోకేశ్ రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article