తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ వెలుగనున్న దీపం.. పర్యవేక్షించనున్న హైకోర్టు జడ్జిలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు!

Must read

Thiruparankundram Deepam Row: మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశం తీవ్ర ఉద్రిక్తతకు, న్యాయపరమైన పోరాటానికి దారితీసింది. దశాబ్దాలుగా కొండపై ఉన్న ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే కార్తీక మహాదీపం(Thiruparankundram Deepam Row) వెలిగించడం సంప్రదాయంగా వస్తుండగా, సమీపంలోని పురాతన రాతిస్తంభం (దీపత్తూన్‌) వద్ద దీపం వెలిగించాలన్న డిమాండ్‌తో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో నవంబర్ 24న దీపత్తూన్‌ వద్ద కాకుండా ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద దీపం వెలిగించడంపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని స్పష్టం చేస్తూ, శనివారం (నవంబర్ 28) ఎట్టి పరిస్థితుల్లోనూ రాతిస్తంభంపైనే దీపం వెలిగించాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఉత్తర్వుల అమలులో విఫలమైన తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మదురై కలెక్టర్ సహా పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది.

సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు.. ఇద్దరు హైకోర్టు జడ్జిల పర్యవేక్షణ:

కోర్టు ఆదేశాల అమలులో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొండ భద్రతా బాధ్యతలను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది. దీంతో శనివారం ఉదయం నుంచే అక్కడ ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ మండపంపై వెలిగే దీపం నుంచి జ్వాలను తీసుకెళ్లి రాతిస్తంభం వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు సూచించగా, ఈ జ్వాల కార్యక్రమాన్ని ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పర్యవేక్షించనున్నారు.

దర్గా వద్ద కట్టుదిట్టమైన భద్రత.. తదుపరి పరిణామాలపై ఉత్కంఠ:

కొండపై దీపం వెలిగించే క్రమంలో సికందర్ దర్గాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీసులు దర్గా పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులను అనుమతిస్తున్నారు. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ధిక్కరణ నోటీసులపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article