Nani Sharwanand : మాస్ అందరి వల్లా కాదు.. ఏదో అంతా ట్రై చేస్తున్నారని యాక్షన్ సినిమాలు చేస్తే.. అవి కాస్త వర్కౌట్ కాక ఇబ్బంది పడ్డవాళ్లే ఎక్కువ. 2026 ఇయర్‌లో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు ఈ ఇద్దరు హీరోలు.
బాక్సాఫీస్ దగ్గర బ్లడ్‌బాత్ చూపిస్తానంటూ నిన్న నవంబర్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన శర్వానంద్ భోగి సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమాలో ఎమోషన్ కంటే భారీ వయెలెన్స్, తలలు నరకడం, రక్తం పారడమే ఎక్కువ ఉండటంతో రిజల్ట్ తేడా కొట్టిందంటున్నారు. క్లాస్ సినిమాలతో, కామెడీతో మెప్పించే శర్వానంద్ భోగి సినిమాలో యాక్టింగ్ పరంగా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆ రక్తపాతానికి భోగి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ లిస్ట్‌లో చేరిపోయిందంటున్నారు.
శర్వా కంటే ముందు ది ప్యారడైజ్ సినిమాతో ఆడియెన్స్ నుంచి ఇలాంటి కామెంట్సే ఫేస్ చేశారు నాని. దసరా నుంచి యాక్షన్ హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడు. పక్కింటి అబ్బాయి ఇమేజ్ తెచ్చుకొని వరుస హిట్స్ కొట్టిన నాని దసరా తో కాస్త యాక్షన్ వర్కౌట్ అయిందని ఈ సారి డోసు భారీగా పెంచి రక్తపాతం చిందించి ప్యారడైజ్ అని వచ్చాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ ఈ విషయంలోనే భారీ ట్రోల్స్ సైతం ఫేస్ చేసింది. జడల్ క్యారెక్టర్‌లో నానిని బిగ్‌స్క్రీన్‌పై చూడలేకపోయామని, కథ, కథనం అంతా గాలికి వదిలి స్క్రీన్ మొత్తాన్ని నరకడం, బ్లడ్‌బాత్ వయెలెన్స్ తో నింపేసారని విమర్శలు వచ్చాయి.
ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉన్న ఈ హీరోలకి మాస్ కంటే క్లాస్ ఎంటర్‌టైనర్సే సేఫ్ అని అభిప్రాయపడుతున్నారు. అక్కర్లేని మాస్ ఇమేజ్ కోసం యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఎంటర్‌టైనర్స్ చేసి ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన నాని అండ్ శర్వానంద్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయాల్లో ఎలా ఉంటారో చూడాలి. నాని ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్‌లో బ్లడీ రోమియో సినిమా చేస్తుండగా శర్వానంద్ 2027 సంక్రాంతికి జార్జ్ క్రిష్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోలను చూసి అయినా నరకడాలు, రక్తపాతాలు చేసి అక్కర్లేని మాస్ ఇమేజ్ కోసం వేరే హీరోలు చేతులు కాల్చుకోకుండా ఉంటారేమో చూడాలి.




