రామ్ చరణ్ – సుకుమార్ RC17 లో నటించాలని ఉందా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే..

Must read

RC 17 : సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం తర్వాత వస్తున్న RC17 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయింది. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఓపెనింగ్ కి మెగాస్టార్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

తాజాగా ఈ సినిమాలో నటించడానికి నటీనటులు కావాలని అధికారిక ప్రకటన చేసారు. RC17 సినిమా యూనిట్ ఓ ఆడిషన్ కాల్ కి పిలుపునిచ్చింది. 16 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న పురుషులు, మహిళలు కోసం చుస్తునారు. నటనపై ఆసక్తి ఉన్నవారు src17casting@gmail.com అనే మెయిల్ కి లేదా 9110564651 నెంబర్ వాట్సాప్ కి తమ ఫోటోలు, ఆడిషన్ వీడియోలు పంపించామన్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మాత్రం పంపించొద్దు అని ప్రత్యేకంగా చెప్పారు. ఒకవేళ ఏదైనా సందేహాలు ఉన్నా ఆ నెంబర్ కి కాల్ చేయకుండా కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయమన్నారు. మరి ఎవరైనా చరణ్ – సుకుమార్ సినిమాలో నటించే ఆసక్తి ఉంటె ట్రై చేయండి.

 

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article