మొహబ్బత్‌ నుంచి మెలోడీ లవ్ సాంగ్ విన్నారా..?

Must read

Mohabbat : సంతోష్‌ రాజా, శ్రేయాస్‌ సేన్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా మొహబ్బత్. ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై అఫ్రోజ్‌ షేక్‌ నిర్మాణంలో మ్యాక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఓ మెలోడీ ప్రేమ గీతాన్ని విడుదల చేసారు.

‘వరమే..’ అంటూ సాగిన ఈ పాటని డైరక్టర్ విఐ ఆనంద్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ సంగీత దర్శకత్వంలో భాష్య శ్రీ ఈ పాట రాయగా కృష్ణ తేజస్వి పాడారు. మాస్టర్ మొయిన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసారు. ఈ సినిమాలో ఈశ్వర్‌ సాయి, మనోజ్‌, సాత్విక్‌, అజయ్‌ ఘోష్‌, సంతోషి, దుర్గ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

మీరు కూడా ఈ వరమే సాంగ్ వినేయండి..

 

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article