ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. పోలీసు శాఖలో 1,534 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

Must read

AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త అందించింది. రాష్ట్ర పోలీసు శాఖలో మొత్తం 1,534 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 378 ఎస్ఐ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఎస్ఐ విభాగంలో 253 సివిల్ ఎస్ఐ, 116 ఏఆర్ రిజర్వ్ ఎస్ఐ, 9 ఎస్‌పీఎఫ్ ఎస్ఐ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ స్థాయిలో 542 సివిల్, 285 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 158 ఫైర్‌మెన్, 150 పురుష వార్డర్, 21 మహిళా వార్డర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

నవంబర్ 27 నుంచి దరఖాస్తులు.. ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఇవే:

ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని బోర్డు వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. కానిస్టేబుల్(AP Police Recruitment) ప్రిలిమినరీ రాత పరీక్షను 2027 జనవరి 31న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అలాగే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను 2027 ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు ఉంటాయి.

త్వరలో ఇతర పోస్టుల షెడ్యూల్.. అధికారిక వెబ్‌సైట్ వివరాలు:

ఎస్ఐ (పీటీఓ, కమ్యూనికేషన్)తో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్లు, డ్రైవర్, మెకానిక్ వంటి ఇతర పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. అభ్యర్థులు పోస్టుల వారీగా పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్ కోసం అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.inను సందర్శించాలని సూచించింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article