ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!

Must read

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేస్తూ, 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల షెడ్యూల్ ప్రకటించారు. గురువారం పోలింగ్ పూర్తయిన ఈ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు, ఫలితాలను నవంబరు 30వ తేదీన వెల్లడించనున్నారు. డిసెంబరు 5వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్(AP Municipal Elections), వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు జరగనుండగా, ఆ రోజు జరగకపోతే డిసెంబరు 6వ తేదీన నిర్వహిస్తారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వివరాలు.. ప్రశాంతతకు విజ్ఞప్తి:

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు, గతంలో వాయిదా పడిన నర్సీపట్నం, మాచర్ల వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు డిసెంబరు 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1వ తేదీ లేదా అంతకుముందే ప్రత్యేక సమావేశాలకు సభ్యులకు నోటీసులు జారీ చేస్తూ, చేతులెత్తే పద్ధతిలో పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article