Jonita Gandhi : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇటీవల SRH ఓనర్ కావ్య మారన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నవంబర్ 11న గ్రీస్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరగ్గా రిసెప్షన్ చెన్నైలో ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించారు. అనిరుద్ – కావ్య మారన్ రిసెప్షన్ కి తెలుగు, తమిళ్ సినీ సెలబ్రిటీలతో పాటు అనేకమంది రాజకీయ నాయకులు హాజరయ్యారు.
అయితే వీరి రిసెప్షన్ నుంచి ఇప్పుడు ఒక ఫోటో వైరల్ గా మారింది. సింగర్, నటి జోనిత గాంధీ అనిరుద్ రిసెప్షన్ కి హాజరై కొత్త జంటతో దిగిన ఫోటో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మరింది.
అనిరుద్ గతంలో పలువురు హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అలాగే సింగర్ జోనిత గాంధీ తో సీరియస్ రిలేషన్ లో ఉన్నారని తమిళ మీడియా మొత్తం కోడై కూసింది. వీరి సన్నిహితులు కూడా అదే నిజమని చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి క్లోజ్ గా వర్క్ చేసారు. కానీ తర్వాత విడిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి. అనిరుద్ పెళ్లి గురించి అధికారికంగా అనౌన్స్ చేసినప్పుడు జోనిత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బ్రేకప్ సాంగ్స్ పెట్టడంతో పెద్ద చర్చే జరిగింది. జోనితతో బ్రేకప్ చెప్పి కావ్య మారన్ ని పెళ్లి చేసుకున్నాడు అనిరుధ్ అని అంతా భావించారు.
ఇప్పుడు బ్రేకప్ తర్వాత కూడా జోనిత గాంధీ అనిరుద్ రిసెప్షన్ కి వచ్చి శుభాకాంక్షలు తెలపడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి జోనిత – అనిరుద్ చర్చగా మారారు. బ్రేకప్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్లిపోవడానికి ఫిక్స్ అయ్యారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




