BOI బంపర్ ఆఫర్.. 500 రోజుల FDతో అదిరిపోయే వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంతొస్తుందంటే?

Must read

  • సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్..
  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదిరిపోయే FD స్కీమ్..
  • సీనియర్లకు ఎక్కువ వడ్డీ.. పూర్తి లెక్కలివే
  • BOI అక్షయ్ FDలో ఎవరికి ఎంత లాభమంటే?

Bank of India Akshay FD : చేతిలో కొంత డబ్బు ఉందా? ఎక్కడైనా పెట్టుబడి పెట్టి మంచి రాబడి పొందాలని చూస్తున్నారా? అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేసేవారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) అందిస్తున్న అక్షయ్ స్పెషల్ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే.

ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్‌లో సాధారణ ఖాతాదారులతో పోలిస్తే ఎక్కువ వడ్డీ లభిస్తోంది. మరి 500 రోజుల పాటు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు పూర్తి లెక్కలతో తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే 500 రోజుల అక్షయ్ ఎఫ్‌డీ పథకంలో డిపాజిట్ టైప్, ఖాతాదారుడి వయస్సును బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. సాధారణ ఖాతాదారులకు కాలబుల్ ఎఫ్‌డీపై 6.85 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వరకు వడ్డీ అందుతోంది.

అయితే, రూ.1 కోటి కన్నా ఎక్కువ.. రూ.3 కోట్ల లోపు నాన్ కాలబుల్ డిపాజిట్లకు సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.65 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ రేటు చిన్న మొత్తాల డిపాజిట్లకు వర్తించదనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి..

రూ.5 లక్షలు పెడితే ఎంతొస్తుంది? :
ఒకవేళ మీరు రూ.5 లక్షలు 500 రోజుల పాటు డిపాజిట్ చేస్తే.. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సాధారణ ఖాతాదారులకు సుమారు రూ.48,556 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.52,230, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.53,337 వరకు వడ్డీ లభిస్తుంది. ఇవి అంచనా లెక్కలు మాత్రమే..

ఏ FD ఎంచుకోవాలి? :
అత్యవసర సమయంలో డబ్బులు అవసరమయ్యే ఛాన్స్ ఉంటే కాలబుల్ ఎఫ్‌డీ చాలా బెటర్.. ఇందులో నిబంధనలకు లోబడి ముందుగానే డబ్బులు తీసుకోవచ్చు. నాన్ కాలబుల్ ఎఫ్‌డీలో మాత్రం గడువు పూర్తయ్యే వరకు డబ్బులు వెనక్కి తీసుకోవడం, వాటిపై రుణం పొందడం సాధ్యం కాదు. అందుకే, అధిక వడ్డీ వస్తోందని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.. మీ అవసరాలు, డబ్బు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితులను బట్టి ఎఫ్‌డీ ఎంచుకోవడం ఎంతైనా మంచిది..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article