తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 14 స్టేషన్లలో హాల్ట్‌తో స్పెషల్ రైలు.. పూర్తి వివరాలు ఇవే!

Must read

Tirupati Special Train: పండుగ సీజన్ సందర్భంగా రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం తిరుపతి వెళ్లే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వన్‌వే స్పెషల్ రైలును నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రైలు నంబర్ 07099 ప్రత్యేక సర్వీసు మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Chennupati Kanthisri: విజయవాడ డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ.. హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు!

మార్గమధ్యంలో ఆగే ప్రధాన స్టేషన్లు ఇవే:

ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించేలా ఈ ప్రత్యేక రైలుకు పలు ముఖ్యమైన స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్‌లో బయల్దేరిన తర్వాత లింగంపల్లి, వికారాబాద్, రాయచూర్, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, కదిరి, ములకలచెరువు, మదనపల్లి, కలికిరి, పీలేరు, పాకాల స్టేషన్లలో ఆగుతూ తిరుపతి చేరుకుంటుంది. చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికలు వేసుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article