- 191 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- డిగ్రీ, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కొలువు
- రైల్వేలో కొత్త నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
Railway Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. భారతీయ రైల్వే నిరుదోగ్యులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వివిధ ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి (CEN నెం. 09/2026) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 191 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి రూ.19,900 నుంచి రూ.44,900 వరకు నెలవారీ జీతం పొందవచ్చు.. పూర్తి నోటిఫికేషన్ వివరాలివే..
ఏయే పోస్టులు ఉన్నాయి? :
ఈ నియామకాల్లో మొత్తం 7 రకాల పోస్టులు ఉన్నాయి. చీఫ్ లా అసిస్టెంట్ 17, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 21, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ 8, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) 79, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ 27, సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) 3, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్) 36 ఖాళీలు ఉన్నాయి. వీటిలో జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది.
Read Also :
అర్హతలు, వయోపరిమితి ఎంత? :
పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, లా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా వంటి విద్యార్హతలు అవసరం.. సంబంధిత సబ్జెక్టుల్లో అర్హత ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పోస్టును బట్టి 22 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిజర్వేషన్ కేటగిరీలకు వయోసడలింపు ఉంటుంది. ఫైనల్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ నియామకాలకు అర్హులు కారు..
ఎంపిక విధానం, పరీక్ష వివరాలివే :
అభ్యర్థులకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 50, జనరల్ అవేర్‌నెస్ 15, రీజనింగ్ 15, మ్యాథమెటిక్స్ 10, జనరల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు అదనంగా ట్రాన్స్‌లేషన్ టెస్ట్ ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు..
ముఖ్యమైన తేదీలివే :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 4, 2026. అయితే, ఫీజు చెల్లింపునకు డిసెంబర్ 6 వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ కరెక్షన్ విండో డిసెంబర్ 7 నుంచి 16 వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించి ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లికేషన్ పూర్తి చేసుకోవడం బెటర్..

