- నా గడ్డం అడ్డమొచ్చిందా.. రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- 500 రోజులే టైమ్.. కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ డెడ్‌లైన్
- అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డొస్తున్నారు?
రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు :
ముఖ్యంగా వరంగల్ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్ హయాంలోనే వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించామని, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించలేదని విమర్శించారు. వరంగల్‌కు ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.
ఇక ఫ్యూచర్ సిటీపై కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదని, వరంగల్లే అసలైన ఫ్యూచర్ సిటీగా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేస్తానంటే తన గడ్డం అడ్డొచ్చిందా? అంటూ వ్యాఖ్యానించారు.
మహిళలను కోటీశ్వరులను చేసే దమ్ముంటే చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచడంతో పాటు, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే సంకేతాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చారు.

