Homeతెలంగాణకాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్.. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పక్కా.. కోటి ఓట్లే...

కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్.. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పక్కా.. కోటి ఓట్లే లక్ష్యం!

  • తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ జెండా..
  • ఎన్నికల టార్గెట్ బయటపెట్టిన రేవంత్
  • సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి సీఎం..
  • పార్టీ బలోపేతానికి భారీ ప్లాన్

మంచి పనులను మైక్‌లో గట్టిగా ప్రచారం చేయాలని, లోపాలు ఉంటే తన చెవిలో చెప్పాలని నేతలకు హితవు పలికారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇక రాజకీయ ప్రత్యర్థులపై రేవంత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గతంలో షర్ట్ విప్పుకునే పరిస్థితి తెచ్చానని, ఈసారి ప్యాంటు కూడా విప్పుకునేలా చేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొలుసు మీద చూపించే శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద కూడా చూపిస్తే బాగుంటుందని విమర్శించారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక డిస్కో డాన్స్ చేసిందన్న సామెతతో సొంత పార్టీ నేతల తీరుపైనా చురకలు అంటించారు..

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు ఏర్పాటు చేస్తాం :
మరోవైపు తెలంగాణ చరిత్ర, సామాజిక ఉద్యమాలకు గుర్తింపునిచ్చేలా ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్య, పండగ సాయన్న, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ పేరును సచివాలయానికి పెట్టడంలో తమ ఒత్తిడి కూడా ఉందని గుర్తుచేశారు.

15 సీట్లు టార్గెట్ :
17 లోక్‌సభ స్థానాల్లో 15 గెలవడమే లక్ష్యమని చెప్పిన సీఎం.. సర్వోత్తం, సామలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ల ఇచ్చినట్టు తెలిపారు. తన మాట వినని వాళ్లు కూడా ఉన్నారని, అలా వినకుండా ఇబ్బంది పడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. ఎవరూ చూడడం లేదని నేతలు ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మొత్తంగా రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో వచ్చే ఎన్నికలపై కొత్త చర్చ మొదలైంది..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments