Homeసినిమాషాకింగ్ ఘ‌ట‌న‌.. జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్ర‌మాదం..

షాకింగ్ ఘ‌ట‌న‌.. జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్ర‌మాదం..

Jabardasth Comedians : జబర్దస్త్ కమెడియన్లు రైజింగ్ రాజు, దొరబాబు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో వీరు గాయ‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ కాకినాడ నుంచి భీమ‌వ‌రం వైపు వెలుతుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న కారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడా అగ్రహారం వద్ద అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్ర‌మాద తీవ్ర‌త‌కు కారు ముందు భాగం నుజ్జునుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదంలో రైజింగ్ రాజు, దొరబాబులకు గాయాలు అయ్యాయి. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. కాగా.. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని సమాచారం.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments