Homeభక్తిశబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే అలర్ట్.. రైళ్లలో ఈ పనులు చేస్తే చిక్కులే!

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే అలర్ట్.. రైళ్లలో ఈ పనులు చేస్తే చిక్కులే!

  • శబరిమల యాత్రికులకు రైల్వే షాక్..
  • అయ్యప్ప స్వాములారా జర భద్రం..
  • ట్రైన్‌లో కర్పూరం వెలిగిస్తే చర్యలు తప్పవు

ఇరుముడి తీసుకెళ్లేవారు జాగ్రత్త :
శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఇరుముడితో పాటు పూజా సామగ్రిని కూడా తీసుకెళ్తుంటారు. అయితే, పూజా సామగ్రిని తీసుకెళ్లడం వేరు.. వాటిని రైలులో వెలిగించి పూజలు చేయడం వేరు. పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, బాణసంచా వంటి ప్రమాదకర వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. కర్పూరం, అగరబత్తుల ప్యాకెట్లను తీసుకెళ్లే విషయంలో మాత్రం ముందుగానే రైల్వే అధికారులను సంప్రదించి క్లారిటీ తీసుకోండి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు :
రైలు ప్రయాణంలో ఇతర ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. నేర తీవ్రతను బట్టి జరిమానా లేదా ఇతర శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. అయ్యప్ప స్వాములు ప్రయాణానికి ముందే రైల్వే నిబంధనలు తెలుసుకోవాలి. భక్తి, భద్రత రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగించాలి..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments