Homeసినిమాఓటీటీలో రచ్చరచ్చే ఇక.. మెగా వర్స్ vs అన్ స్టాపబుల్

ఓటీటీలో రచ్చరచ్చే ఇక.. మెగా వర్స్ vs అన్ స్టాపబుల్

MEGA VS BALAIAH TALK SHOW : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ టాక్‌ షో గ్రాండ్ సక్సెస్ అయింది. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ బాలయ్య చేసిన సందడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కొంతకాలంగా ఈ షోకు బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ..ఇప్పుడు మరోసారి అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 5తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే నాలుగు సీజన్లతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ షోను మరింత కొత్తగా, భారీ కంటెంట్‌తో తీసుకురావాలని ఆలోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్-5కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే ప్రారంభం కానుందట. ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సినీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.

బాలయ్య టాక్‌షోపై అలాంటి టాక్ నడుస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వేదికగా మెగా వర్స్ టాక్‌ షోను చేస్తున్నారు. కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుండగా, అవి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెగా వర్స్‌ వర్సెస్ బాలయ్య అన్‌స్టాపబుల్..ఆడియన్స్‌ను మెప్పించేదెవరన్నది ఆసక్తి రేపుతోంది.

మెగాస్టార్ తనదైన స్టైల్‌లో మెగా సందడి చేయనుంటే..బాలయ్య తన పంచులు, చమత్కారాలు, సెలబ్రిటీలతో సరదా సంభాషణలతో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా నందమూరి వర్సెస్ మెగా వార్ అంటూ టాలీవుడ్‌లో ఇంకో టాక్ కూడా ఊపందుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఇటు మెగా వర్స్, అటు అన్‌స్టాపబుల్‌..ప్రేక్షకులకు అసలైన కిక్ ఇచ్చే టాక్ షో ఏదన్నది వేచి చూడాలి మరి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments