Homeటెక్నాలజీవావ్.. ఐఫోన్ 18, ఎయిర్ 2 వచ్చేస్తున్నాయ్.. ఈసారి ఆపిల్ ఇవ్వబోయే సర్‌ప్రైజ్‌లు ఇవే!

వావ్.. ఐఫోన్ 18, ఎయిర్ 2 వచ్చేస్తున్నాయ్.. ఈసారి ఆపిల్ ఇవ్వబోయే సర్‌ప్రైజ్‌లు ఇవే!

  • ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..
  • త్వరలో ఐఫోన్ 18, ఎయిర్ 2 ఎంట్రీ
  • సన్నని డిజైన్.. భారీ బ్యాటరీ అప్‌గ్రేడ్
  • 9GB ర్యామ్.. 3,500mAh బ్యాటరీ

ఇక పనితీరు విషయానికి వస్తే.. A20 చిప్‌సెట్‌తో పాటు 9GB ర్యామ్ ఉండవచ్చని అంచనా.. బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా, మరో 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీల కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు..

ఎయిర్ 2లో బ్యాటరీ అప్‌గ్రేడ్ :
మరోవైపు ఐఫోన్ ఎయిర్ 2 కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులతో రానుందని సమాచారం.. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో ఆపిల్ కీలక అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలుస్తోంది.. ప్రస్తుతం ఐఫోన్ ఎయిర్‌లో 3,149mAh బ్యాటరీ ఉండగా, కొత్త మోడల్‌లో దాదాపు 3,500mAh బ్యాటరీ ఇవ్వవచ్చని అంచనా..

దీంతో పాటు 6.55 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 48MP ప్రైమరీ కెమెరా, కొత్త అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చని టాక్.. ఈ ఐఫోన్ మందం సుమారు 5.2 మిల్లీమీటర్లుగా ఉండవచ్చని సమాచారం. టైటానియం ఫ్రేమ్‌ను కూడా కొనసాగించే అవకాశం ఉంది..

అయితే, గత ఐఫోన్ ఎయిర్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఎయిర్ 2 తయారీ పరిమాణాన్ని తగ్గించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ 2 ఐఫోన్లపై ఆపిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments