- జగన్ అక్రమాస్తుల కేసులో మరో మలుపు..
- దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దూకుడు
- 15 ఏళ్లుగా సాగుతున్న కేసు.. జగన్‌పై ఈడీ కొత్త ఛార్జిషీట్
ఈ వ్యవహారంలో జగన్‌కు సుమారు రూ.150 కోట్ల మేర అక్రమ ప్రయోజనం చేకూరినట్లు సీబీఐ తన ఛార్జిషీట్లో ఆరోపించింది. రఘురామ్ సిమెంట్స్‌లో రూ.95 కోట్ల విలువైన షేర్లు, మరో రూ.55 కోట్లు హవాలా మార్గంలో అందించారని పేర్కొంది..
ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ :
సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో రంగంలోకి దిగిన ఈడీ.. గతంలోనే దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ అంశంపై గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కొన్ని సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి పంపింది..
దీంతో గతంలో జరిగిన లోపాలను సరిచేసి, అదనపు ఆధారాలు, అవసరమైన అనుమతులతో ఈడీ తాజాగా మరోసారి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటికే తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ.. ఇప్పుడు పదో ఛార్జిషీట్‌ను కూడా కోర్టు ముందుంచింది. 15 ఏళ్లుగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసులో తాజా ఛార్జిషీట్‌ను కోర్టు పరిశీలించనుంది.


