తెలంగాణలో ఇళ్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్ లో భారీ మార్పులు.. చిన్న ప్లాట్ల వారికి ప్రయోజనం!

Must read

Telangana New Building Rules: ప్రస్తుత రోజుల్లో సొంతింటి కలను నిజం చేసుకోవాలంటే స్థలం కొనడం ఒక ఎత్తయితే, ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందడం, కఠినమైన నిబంధనలను అధిగమించడం సామాన్యులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న ప్లాట్లు ఉన్నవారు సెట్‌బ్యాక్, పార్కింగ్ నిబంధనల వల్ల తమ స్థలంలో నిర్మాణ విస్తీర్ణాన్ని భారీగా తగ్గించుకోవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం 2012 నాటి పాత బిల్డింగ్ రూల్స్(Telangana New Building Rules) స్థానంలో సరికొత్త సమగ్ర నియమావళిని తీసుకొచ్చేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు 75 గజాల వరకు ఉన్న ప్లాట్లకు నిర్మాణ అనుమతుల నుంచి మినహాయింపు ఉండగా, దానిని 100 గజాలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా భవనం చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్) దూరాలను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనివల్ల చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టుకునే సామాన్యులకు మరింత అదనపు నిర్మాణ స్థలం అందుబాటులోకి రానుంది.

పార్కింగ్ సమస్యకు చెక్.. సెల్లార్ నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు:

నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు సెల్లార్ నిర్మాణ అర్హతలను కూడా సవరించనున్నారు. ప్రస్తుతం 900 గజాల స్థలం ఉంటేనే సెల్లార్‌కు అనుమతిస్తుండగా, ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. అలాగే 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఒక సెల్లార్‌కు బదులుగా రెండు సెల్లార్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాలు నిలిపే పరిస్థితి తగ్గుముఖం పట్టనుంది.

బిల్డర్లకు మార్టిగేజ్ నుంచి ఊరట.. త్వరలోనే సమగ్ర ముసాయిదా:

మరోవైపు నిర్మాణ అనుమతుల సమయంలో భవనంలోని కొంత భాగాన్ని తాకట్టు (మార్టిగేజ్) పెట్టే నిబంధన నుంచి నిర్దిష్ట పరిమాణంలోపు నిర్మాణాలకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గతంలో 62 సార్లు చేసిన విడివిడి సవరణలన్నింటినీ సమీక్షించి మున్సిపల్ శాఖ అధికారులు ఒకే సమగ్ర ముసాయిదాను సిద్ధం చేస్తుండగా, తుది ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవి అమల్లోకి రానున్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!