ఆరు నెలల పసిప్రాయంలోనే అద్భుతం.. అసాధారణ ఏకాగ్రతతో ప్రపంచ రికార్డు.. ‘ది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో అనఘ ఇక్కుర్తి!

Must read

Anagha Ikkurthi: సాధారణంగా ఆరు నెలల పసిపిల్లలు ఒక్క నిమిషం కూడా ఒకే చోట నిలకడగా ఉండలేరు. చుట్టూ కనిపించే వస్తువులు, శబ్దాల వైపు క్షణక్షణానికి దృష్టి మరల్చుతూ అల్లరి చేస్తుంటారు. అలాంటిది, ఆ పసి వయసులోనే అసాధారణమైన ఏకాగ్రతను ప్రదర్శించి ఓ తెలుగు చిన్నారి ఏకంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వెల్లలూరు గ్రామానికి చెందిన ఇక్కుర్తి శ్యామ్, గాయత్రి దంపతులు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వీరి ఆరు నెలల గారాలపట్టి అనఘ ఇక్కుర్తి(Anagha Ikkurthi), తన అపూర్వమైన శ్రద్ధ, సహజసిద్ధమైన పరిశీలనాశక్తితో ‘ది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించి తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది.

పుస్తక పఠనంపై సుదీర్ఘ ఏకాగ్రతతో అరుదైన ఘనత:

తల్లిదండ్రులు పుస్తకాన్ని బిగ్గరగా చదివి వినిపిస్తున్న సమయంలో, చిన్నారి అనఘ ఏమాత్రం విసుగు చెందకుండా, పక్కకు దృష్టి మరల్చకుండా సుదీర్ఘ సమయం పాటు నిరంతరాయంగా ఆ పుస్తకంపైనే తన దృష్టిని కేంద్రీకరించింది. చిన్నారుల్లో ఉండే ఈ అరుదైన ప్రతిభకు గుర్తింపుగా ‘కిడ్స్ అండ్ యంగ్ అచీవర్స్’ విభాగంలో ‘లాంగెస్ట్ సస్టెయిన్డ్ అటెన్షన్ టు ఎ రీడ్-అలౌడ్ బుక్ బై ఎ 6-మంత్-ఓల్డ్ ఇన్ఫంట్’ కేటగిరీలో అనఘ ప్రపంచ రికార్డు సాధించినట్లు ది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అధికారిక ధ్రువీకరణ పత్రం జారీ.. సర్వత్రా ప్రశంసలు:

ఈ విశిష్ట ఘనతను గుర్తిస్తూ సంస్థ మంగళవారం నాడు చిన్నారి పేరిట అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. ఆరు నెలల పసిప్రాయంలోనే అద్భుతమైన ఏకాగ్రతతో అరుదైన రికార్డు సృష్టించిన అనఘ ఇక్కుర్తిపై బంధువులు, స్నేహితులు, ప్రవాస తెలుగు వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!