Gold Silver Prices Today: శుభకార్యాల సీజన్ వేళ బంగారం కొనాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నేడు మార్కెట్ నుంచి కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.13,326 వద్ద ఉండగా, 10 గ్రాముల (తులం) ధర రూ.278 మేర తగ్గి రూ.1,33,260 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,215 చొప్పున, తులానికి రూ.255 తగ్గి రూ.1,22,150 వద్ద స్థిరపడింది. అయితే ఈ ధరలకు జీఎస్టీ, స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని వినియోగదారులు గమనించాలి.
తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వాణిజ్య నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌లలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం (Gold Silver Prices Today)రూ.1,33,410 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,300 గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,260 గా, 22 క్యారెట్ల ధర రూ.1,22,150 గా ఉంది. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం రూ.1,33,850, 22 క్యారెట్ల ధర రూ.1,22,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో కిలో ఎంతంటే?
బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,85,000 వద్ద నిలకడగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లోనూ కిలో వెండి రూ.1,85,000 గా కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కాస్త తక్కువగా రూ.1,76,000 వద్ద విక్రయమవుతోంది.


