- బంగారంలో చైనా పొడి కల్తీ..
- 22 క్యారెట్లంటూ 20 క్యారెట్ల బంగారం విక్రయం
- బరువు పెంచే చైనా రేణియం గుట్టురట్టు
- యంత్రాలనూ బోల్తా కొట్టిస్తున్న రేణియం
22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారం :
ఈ ఆభరణాన్ని హాల్‌మార్కింగ్ కేంద్రంలో పరీక్షించగా 22 క్యారెట్లు.. అంటే 91.6 శాతం స్వచ్ఛత ఉన్నట్లు నివేదిక వచ్చింది. కానీ, అసలు లెక్కలు చూస్తే.. అందులో బంగారం శాతం కేవలం 81.73 మాత్రమేనని తేలింది. అంటే.. కొనుగోలుదారుడికి 22 క్యారెట్ల పేరుతో దాదాపు 20 క్యారెట్ల బంగారం అంటగట్టినట్లే కదా..
యంత్రాలకే దొరకని కల్తీ.. :
మరో షాకింగ్ విషయం ఏంటంటే.. బ్రాండెడ్ షోరూమ్‌తో పాటు ఇతర పరీక్షా కేంద్రాల్లోనూ ఈ కల్తీని గుర్తించలేకపోయినట్లు ఇందులో తేలింది. తులం బంగారం కొనుగోలులోనే వేల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. బంగారం కొనుగోలుదారులకు తీరని నష్టంగా చెప్పొచ్చు..
అయితే, ఈ ఒక్క ఉదంతంతో మార్కెట్లోని బంగారమంతా కల్తీ అని భావించకూడదు. కానీ, బంగారం కొనేటప్పుడు నమ్మకమైన దుకాణాన్ని ఎంచుకోవడం, హాల్‌మార్క్ (HUID) వివరాలను చెక్ చేయడం, అవసరమైతే స్వతంత్రంగా స్వచ్ఛత టెస్టింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మెరుపును చూసి మురిసిపోవడం కాదు.. మనం పెట్టిన డబ్బుకు తగినంత స్వచ్ఛమైన బంగారం వస్తోందా లేదా అన్నదే అసలు విషయం..


