ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈనెల 26న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు

Must read

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పరిపాలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం(AP Government) నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వరుస ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు (కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) ఈనెల 26న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలలో పనిచేసే సిబ్బంది కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా వారికి సెలవు ఇవ్వాలని ఆయా యాజమాన్యాలను ఆదేశించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు పంపింది. అంతేకాకుండా ఎన్నికలు జరిగే 23 ప్రాంతాల్లో పోలింగ్ అవసరాల నిమిత్తం వివిధ ప్రభుత్వ శాఖల వాహనాలను కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది.

విపత్తుల నివారణకు ‘ఏపీ-ఐడీఐఎస్’.. రూ.40 కోట్ల నిధుల మంజూరు:

మరోవైపు రాష్ట్రంలో ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘ఏపీ-ఐడీఐఎస్’ (ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్) అమలుకు ప్రభుత్వం విపత్తుల రిలీఫ్ నిధి నుంచి రూ.40 కోట్లు కేటాయించింది. జీఐఎస్ ఆధారిత వ్యవస్థ, మొబైల్ యాప్‌లు, ముందస్తు హెచ్చరికలు, తక్షణ స్పందన కోసం ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున 28 మంది జిల్లా ప్రాజెక్టు మేనేజర్లను మూడేళ్ల కాలానికి నియమించనున్నారు.

అమరావతి సచివాలయంలో అట్టహాసంగా వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం:

అమరావతి సచివాలయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) ఆధ్వర్యంలో వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించగా, నాలుగు గ్రూపులుగా విభజించిన సుమారు 1,400 మంది ఉద్యోగులు 13 విభాగాల్లో తలపడుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!