మనం మంచి అలవాట్లను ఎందుకు వాయిదా వేస్తాం, ఫోన్ స్క్రోలింగ్ ఇచ్చే చీప్ డోపమైన్ ఉచ్చులో ఎలా పడిపోతున్నాం, మనం తినే ఆహారం, మన నిద్ర మన మెదడును ఎలా శాసిస్తున్నాయి.. లాంటి పలు విషయాలను ప్రాక్టికల్ గా వివరించారు ఈ పుస్తకంలో. ఆటోపైలట్ మోడ్ నుండి బయటపడి జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని అనుదీప్ తెలిపారు. మనమందరం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఈ పుస్తకంలో సమాధానాలు ఉన్నాయట.
ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ప్రముఖ పుస్తకాల షాపులలో, అమెజాన్ లో ఈ పుస్తకం దొరుకుతుంది. తెరపై, తెరవెనక నవ్వించే దర్శకుడు అనుదీప్ కెవి ఇలా పుస్తక రచయితగా మారి బివి పట్టాభిరామ్ స్టైల్ లో ఇవాళ్టి కాలంలో జనాలకు లైఫ్ కి ఉపయోగపడే ఇలాంటి పుస్తకం రాస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ పుస్తకం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చదవొచ్చు.


