‘ది సెస్సో’ ట్రైలర్ రిలీజ్.. ఈ బోల్డ్ ట్రైలర్ చూశారా..?

Must read

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆకాశ్‌ జగన్నాథ్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్‌ చాలా బాగున్నారు. ఈ టీం మరిన్ని సినిమాలు తీయాలి, ఈ సినిమా హిట్ అవ్వాలి అని అన్నారు. దర్శకుడు, హీరో యశ్‌ రాజ్ మాట్లాడుతూ.. సినిమా లైఫ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఆ అందమైన జీవితం వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి. సొసైటీ గురించి నాకు వచ్చిన ఆలోచన ఈ సినిమాకు బీజం వేసింది. ఈ మూవీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిందే. ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చాక చాలా నేర్చుకున్నాను అని తెలిపారు.

The Sesso Trailer

గండిపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. కనిపించడానికి 3 గంటల సినిమా. కానీ దీని వెనుక మూడు వందల రోజుల కష్టం ఉంటుంది. ఎంతో కష్టపడితేనేగాని హీరో అవ్వలేరు. కష్టం విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇంత వరకు వచ్చాను. ఈసారి జరిగే ఈవెంట్‌కు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ను, శ్రీశైలం యాదవ్‌ను తీసుకువస్తాను అని అన్నారు. నిర్మాత బి.ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డాం. మా టీమ్‌ అంతా చాలా కష్టపడి ఈ సినిమా తీశాం అని అన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!