- రూ. 15,999కే 7000mAh బ్యాటరీతో రియల్‌మి 5జీ ఫోన్..
- 7000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో అద్భుతంగా ఉంది
- తక్కువ ధరలో అదిరిపోయే 5జీ ఫోన్ ఎలా కొనాలంటే?
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీలో 6.9 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. 1570×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఫోన్లో 7000mAh భారీ బ్యాటరీ ఉండటం స్పెషల్ అట్రాక్షన్.. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..
మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ హీట్ కాకుండా ఉండేందుకు 5300mm² ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐపై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.
కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఉన్నాయి. వీటితో పాటు IP64 రేటింగ్, అర్మర్షెల్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. భారీ బ్యాటరీ, డిస్ప్లేతో పాటు 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ ఫోన్ బడ్జెట్ ఆప్షన్.. అయితే, కొనుగోలు చేసే ముందు ర్యామ్, స్టోరేజ్, కెమెరా రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోవడం బెటర్..


