శ్రీలీల మాట్లాడుతూ.. రేణు గారు నేను మీ బుర్ర బాగా తిన్నాను షూట్ లో. రెండు రోజులు షాపింగ్ మాల్ లో షూట్ అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. మీరు 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు డిఫరెన్స్ లేదు. ఆవిడ అప్పటి ఫోటో కూడా చూపించారు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు.
ఆద్య నువ్వు ఒక గొప్ప మహిళగా పెరుగుతున్నావు. నాకు ఇంకా గుర్తు ఉంది నిన్ను కలిసినపుడు నీకు షార్ట్ హెయిర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ నిన్ను చూడటం ఆనందంగా ఉంది. నీ పుట్టిన రోజు నాడు కలిసాము ఇవాళ మళ్ళీ కలవడం సంతోషంగా ఉంది అని తెలిపింది.


