ఇది కదా డిస్కౌంట్.. రూ.88వేల శాంసంగ్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే?

Must read

  • శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
  • రూ.87,999 శాంసంగ్ ఫోన్ ఇప్పుడు రూ.83,999కే..
  • 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో శాంసంగ్ ఫోన్

దీంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.83,999కు చేరుతుంది. అంతేకాదు, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. గరిష్ఠంగా రూ.57,200 వరకు అదనపు బెనిఫిట్ పొందొచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఫీచర్లు కూడా అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్‌పై కంటెంట్ చూడటం, గేమ్స్ ఆడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5తో వస్తుంది..

కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. ప్రైమరీ, టెలిఫోటో కెమెరాలకు OIS సపోర్ట్ కూడా ఉంది. వై-ఫై 7, బ్లూటూత్ 5.4, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కేవలం 167 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంపర్ట్ ఉంటుంది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!