- బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
- శాంసంగ్ కొత్త గెలాక్సీ A18 4జీ వచ్చేసింది
- 90Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు
- సూపర్ అమోల్డ్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా
డిస్ప్లే, ప్రాసెసర్ :
ఈ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేట్, 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో స్క్రీన్ బెస్ట్ వ్యూ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. మీడియాటెక్ హీలియో G99+ చిప్సెట్తో పనిచేసే ఈ ఫోన్లో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందించారు.
కెమెరా, బ్యాటరీ స్పెషాలిటీ :
ఫోటోల కోసం ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరాతో పాటు 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా అమర్చారు.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. :
5000mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 196 గ్రాములు కాగా, మందం 7.7 మిల్లీమీటర్లు ఉంటుంది. రోజువారీ అవసరాలకు సరిపోయే డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఫీచర్లతో గెలాక్సీ ఎ18 4జీ మార్కెట్లోకి వచ్చింది. అయితే, భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ధర ఎంత ఉంటుంది అనేది ఇంకా రివీల్ చేయలేదు..


